అపోలో ఆసుపత్రి వద్ద మెగా ఫ్యాన్స్ సందడి.. ప్రిన్సెస్ వచ్చిందంటూ ఫ్లెక్సీలతో విషెస్

by samatah |   ( Updated:2023-06-20 08:43:09.0  )
అపోలో ఆసుపత్రి వద్ద మెగా ఫ్యాన్స్ సందడి.. ప్రిన్సెస్ వచ్చిందంటూ ఫ్లెక్సీలతో విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా ఫ్యామిలీలో ఆనందం మొదలైంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెగా వారసురాలు వచ్చేసింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు తన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అభిమానులు రామ్ చరణ్ , ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించడంతో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అపోలో ఆసుపత్రి వద్దకు భారీగా తరలి వెళ్లి, మెగా ప్రిన్సెస్ వచ్చిందంటూ ఆసుపత్రి చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చెశారు. అంతే కాకుండా ఆసుపత్రి సిబ్బంది, ఫ్యాన్స్ కోసం స్పెషల్ గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కాగా, చిరంజీవితో సహా కుటుంబసభ్యులు ఇప్పటికే ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

Also Read: పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. మెగా వారసురాలు వచ్చేసింది..

Advertisement

Next Story