- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పీఎం, సీఎంలు నన్ను రక్షించాలి.. అతడు నన్ను పదే పదే రేప్ చేస్తున్నాడు

దిశ, సినిమా: నటుడు తన్వీర్ అక్తర్ ఖాన్ ప్రేమను ‘లవ్ జిహాద్’గా పేర్కొంటూ మోడల్ మాన్వి రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన గుర్తింపును దాచిపెట్టి యష్‌గా పరిచయం చేసుకుని, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. బలవంతంగా పెళ్లి చేసుకుని ఇస్లాం మతంలోకి మార్చాడని మరోసారి మీడియా ముందుకు వచ్చింది. ‘అతను నన్ను చంపేస్తాడు. నేను హిందువునే.. హిందువుగానే ఉంటాను. ఎప్పటికీ ముస్లింను కాలేను. ఆ కమ్యూనిటీకి చెందిన వారిని వివాహం చేసుకోను. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి నన్ను ఈ రాక్షసుడి నుంచి కాపాడాలని కోరుకుంటున్నా. మాకు సంబంధించిన అభ్యంతరకరమైన ఫొటోలను వైరల్ చేస్తానని నన్ను బెదిరిస్తున్నాడు. 2021 నుంచి నాపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు’ అని చెప్పుకొచ్చింది. కాగా ‘ది కేరళ స్టోరీ’ చూసిన తర్వాత ఆ సంఘటన గురించి బహిరంగంగా మాట్లాడే ధైర్యం వచ్చిందని, సినిమా చూసిన తర్వాత ప్రేరణ పొందానని చెప్పడం విశేషం.
Also Read..
ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకున్న నిధి అగర్వాల్..! అవసరమా అంటున్న నెటిజన్లు