వారి కోసం ఎదురు చూస్తున్నా.. మంచు విష్ణు పోస్ట్ వైరల్

by sudharani |   ( Updated:2024-05-04 07:57:14.0  )
వారి కోసం ఎదురు చూస్తున్నా.. మంచు విష్ణు పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ఈ పౌరాణిక కథ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా మహాశివరాత్రి రోజున విడుదలైన ‘కన్నప్ప’ ఫస్ట్‌లుక్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. దీంతో మూవీపై రోజురోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, శివరాజ్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందంతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సైతం ఈ చిత్రంలో నటిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల అక్షయ్ కుమార్ కొద్ది రోజుల క్రితం ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా అక్షయ్ కుమార్‌తో షూటింగ్ పూర్తి కావడంతో.. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు విష్ణు. ఈ మేరకు ‘అక్షయ్ కుమార్‌తో కలిసి పని చెయ్యడం చాలా సంతోషంగా ఉంది. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను’ అని చెప్పుకొస్తూ.. ‘ఇంకా చాలా మంది కోసం ఎదురు చూస్తున్నారు’ అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

Read More..

ప్రభాస్ ఫొటోను అక్కడ నగ్నంగా టాటూ వేసుకున్న అమ్మాయి.. మరీ ఇంత న్యూడ్‌గా ఉందేంట్రా బాబు!


Advertisement

Next Story