- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాజకీయాల్లోకి మంచు లక్ష్మీ? ఏకంగా ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి పిలుపు!

X
దిశ, సినిమా: మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఆమె నటించింది కొన్ని చిత్రాలే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే తాజాగా మంచు లక్ష్మీకి ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీని గురువారం మంచు లక్ష్మీ కలవబోతున్నట్లు తెలుస్తోంది. గతంలోను మోదీ, మోహన్ బాబు చాలాసార్లు కలిసిన సందర్భాలున్నాయి. దీంతో బీజేపీలోకి మంచు లక్ష్మీని ఆహ్వానించటానికి ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి పిలుపు అందిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా మహిళా బిల్లును కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో పేరున్న ఎంతోమంది మహిళలను పిలిపించి మాట్లాడుతున్నారని అందులో భాగంగానే మంచు లక్ష్మీకి ఆహ్వానం అందిందని మరికొందరు అంటున్నారు.
Next Story