వావ్.. సూపర్ ఇంట్రెస్టింగ్‌.. ఏపీ రాజకీయాలపై మంచు లక్ష్మి ట్వీట్

by Javid Pasha |   ( Updated:2023-09-16 03:01:28.0  )
వావ్.. సూపర్ ఇంట్రెస్టింగ్‌..  ఏపీ రాజకీయాలపై మంచు లక్ష్మి ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపై సినీ నటి మంచు లక్ష్మి ట్విట్టర్‌లో స్పందించారు. వావ్.. ఏపీ రాజకీయాలు సూపర్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయని ట్వీట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై ప్రత్యక్షంగా స్పందించని మంచు లక్ష్మి.. ఇలా పరోక్షంగా ఏపీలోని రాజకీయ పరిణమాల గురించి ట్వీట్ చేయడంతో వైరల్‌గా మారాయి. మంచు లక్ష్మి ట్విట్టర్‌లో బాగా యాక్టివ్‌గా ఉంటారు. రాజకీయ, సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు.

ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించగా.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్ధుల్లా, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి వంటి ప్రముఖ నేతలు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఖండించారు. చంద్రబాబు గతంలో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం, నేతలందరితో పరిచయాలు ఉండటంతో.. ప్రతిఒక్కరూ స్పందింస్తున్నారు. దీంతో గత ఐదు రోజులుగా చంద్రబాబు అరెస్ట్ అంశం జాతీయ మీడియాలో కూడా హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story