- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచు లక్ష్మీ బర్త్ డే స్పెషల్.. ‘ఆదిపర్వం’ నుంచి మాస్ లుక్ రిలీజ్
దిశ, సినిమా: మంచు లక్ష్మీ పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపర్వం’ నుంచి అదిరిపోయే మాస్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. 1974-1990 మధ్యకాలంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా సంజీవ్ మేగోటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పూర్తిగా ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగానే కాకుండా ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకుంటున్న చిత్రంలో మంచులక్ష్మీ పోషిస్తున్న పాత్ర ఆమె కెరీర్‌లోనే చిరస్థాయిగా నిలిచిపోతుందని దర్శకనిర్మాతలు ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇక రెట్రో ఫీల్‌తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మొదలై కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆద్యంతం అలరించే చిత్రంలో ఫైట్స్ అండ్ గ్రాఫిక్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటాయని మూవీ టీమ్ తెలిపింది. రావుల వెంకటేశ్వర్రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్-అమెరికా ఇండియా (ఎ.ఐ) ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.