- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను సెక్స్ ను చూడనంటూ రణబీర్ యానిమల్ మీద షాకింగ్ కామెంట్స్ చేసిన కొంకణా సేన్
దిశ,సినిమా: రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన మూవీ యానిమల్. ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. డిసెంబర్ 1న ఈ మూవీ థియేటర్లలో విడులైంది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ను ఓ రేంజ్లో షేక్ చేసింది. దాదాపు రూ.900 కోట్ల పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది. ఆర్జీవీ లాంటి దర్శకులు సినిమా సూపర్ అని ప్రశంసించినా, కొందరు ప్రముఖులు సమాజంలో స్త్రీలను చిన్నచూపు చూసారంటూ విమర్శించారు. తాజాగా ఈ సినిమా గురించి నటి, ఫిల్మ్ మేకర్ కొంకణా సేన్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
యానిమల్ సినిమా మీద కొంకణా సేన్ శర్మ స్పందించింది. ఓ వైపు తనకు వెండితెరపై హింస, సెక్స్ ను చూడాలనిపించదని చెప్తూనే, మరోవైపు పరిమిత మేరకు ఉంటే ఏమి కాదని చెబుతోంది. స్టోరీను జస్టిఫై చేసేంత వరకు సెక్స్ ను తెర మీద చూపించడంలో ఇబ్బంది లేదని చెప్పింది. "తెరపై హింస,సెక్స్ ను చూపించడానికి సరైన కారణం ఉంటే ఓకే కానీ, సందర్భం లేకపోయినా కావాలని వాటిని సినిమాల్లో పెట్టడం కరెక్ట్ కాదు. నేను ఈ సినిమా చూడలేదు. ఈ మూవీ గురించి వింటున్న విషయాలను బట్టి నేను చెబుతున్నాను. ఇది నాకు సూట్ కాదనిపిస్తుంది. కానీ, చాలా మంది ఈ సినిమాను చూస్తున్నారు. నా అభిప్రాయం సినిమా మీద పెద్దగా ప్రభావం చూపించదు అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది.