- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Konidela Surekha: పారిస్ ఒలంపిక్స్‌లో ‘అత్తమ్మాస్ కిచెన్’ ఫుడ్ ప్యాకెట్లను పంచుతున్న కొణిదెల సురేఖ
దిశ, సినిమా: పారిస్ వేదికగా ఒలంపిక్స్ క్రీడలు ఘనంగా జరుగుతున్నాయి. మన దేశానికి పతకాలు తెచ్చేందుకు భారత ఆటగాళ్లు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మనూ భాకర్ షూటింగ్ లో కాంస్య పతకం గెలిచి సత్తా చాటింది. సింధు, నిఖత్ జరీన్ లు కూడా మొదటి రౌండ్ లో గెలిచి తర్వాత రౌండ్లకు సెలెక్ట్ అయ్యారు. ఈ ఆటలను చూడటానికి సెలబ్రిటీలు పారిస్ కు వెళ్లారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం కూడా ఉంది. చిరుతో పాటు కొడుకు రామ్ చరణ్, సురేఖ, ఉపాసన వెళ్ళారు.
ఇదిలా ఉండగా పారిస్ ఒలంపిక్స్ లో ఇండియన్ ఫుడ్ అసలు దొరకడం లేదట. పీవీ సింధు కూడా ఈ విషయం చెప్తున్నప్పుడు వీడియో తీసి తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. భారత ఆటగాళ్ళ కోసం అత్తమ్మాస్ కిచెన్ నుంచి తీసుకొచ్చిన ఫుడ్ ప్యాకెట్స్ తీసి చూపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ఈ ఫుడ్ ప్యాకెట్లను భారత క్రీడాకారులకు ఇవ్వాలని సురేఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. దేశం ఏదైనా సరే మెగా ఫ్యామిలీ సంస్కారం, గౌరవం ఆ లెక్కలే చాలా వేరు అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.