Kollywood: దీపావళి పండుగే టార్గెట్.. బరిలోకి దిగనున్న కోలీవుడ్ స్టార్స్

by Prasanna |   ( Updated:2023-03-08 09:40:12.0  )
Kollywood: దీపావళి పండుగే టార్గెట్.. బరిలోకి దిగనున్న కోలీవుడ్ స్టార్స్
X

దిశ,వెబ్ డెస్క్: ఇండియాలో ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండు నడుస్తుంది. సెట్స్ పై ఉన్న సినిమాలు ముందే విడుదల డేటును ఖరారు చేస్తున్నాయి. భారీ డిమాండ్ ఉన్న క్రేజ్ సీజన్లను ముందే వాటిపై ఓ కన్నేసి ఉంచుతున్నారు.

సౌత్ లో సంక్రాంతి తర్వాత ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యేది దసరా, దీపావళి. సమ్మర్ సీజన్ని నాని, అఖిల్ బుక్ చేసుకున్నారు. ప్రజెంట్ ఇదే ప్రాసెస్లో కోలీవుడ్ స్టార్ హీరోస్ వేగాన్ని అమాంతం పెంచేశారు. వచ్చే దీపావళికి ఒకటి.. రెండు కాకుండా ఏకంగా 5 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మన ముందుకు రాబోతున్నాయి. వారసుడు హిట్ కొట్టిన విజయ్ ఇప్పుడు లోకేష్ కనక రాజు డైరెక్షన్స్ ఒక సినిమాచేస్తున్నాడు. అజిత్ చేస్తున్న AK62 కూడా దీపావళికి వస్తుందట. సూర్య హీరోగా శివ తెరకెక్కిస్తున్న సూర్య 42 సినిమా కూడా దీపావళికి వస్తుందట. జైలర్ సినిమా కూడా సీజన్ పై కన్నేసిందట. శంకర్ తీస్తున్న ఇండియన్ 2 కూడా దీపావళికి పక్కాగా వస్తుందట.

ఇవి కూడా చదవండి : Venkatesh: ఈ సిరీస్ మాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది: వెంకటేష్

Advertisement

Next Story

Most Viewed