- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రిన్సెస్ డయానా లాకెట్ సొంతం చేసుకున్న మోడల్.. తప్పని విమర్శలు
దిశ, సినిమా : అమెరికన్ టెలివిజన్ స్టార్ కిమ్ కర్దాషియన్ మరోసారి కాంట్రవర్సీ ఎదుర్కొంటోంది. హిస్టారికల్ థింగ్స్‌పై ప్రత్యేక అభిమానమున్న కిమ్.. మార్లిన్ మన్రో ఐకానిక్ 'హ్యాపీ బర్త్‌డే. మిస్టర్ ప్రెసిడెంట్' డ్రెస్‌ను కొనుగోలు చేసి ఇప్పటికే ట్రోలింగ్‌కు గురైంది. కాగా ఇప్పుడు ప్రిన్సెస్ డయానాకు చెందిన ఐకానిక్ క్రాస్ పెండెంట్‌ను సొంతం చేసుకుని మరోసారి విమర్శల పాలైంది. సోథెబైస్ లండన్ రాయల్ అండ్ నోబుల్ వేలంలో దాదాపు రూ.1.64 కోట్లకు ఈ పెండెంట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ లాకెట్ మొదట్లో 1920లలో కోర్టు జువెల్లర్ గారార్డ్ చేత క్యూరేట్ చేయబడగా.. 60 సంవత్సరాల తర్వాత.. అక్టోబర్ 1987లో బర్త్‌రైట్ ఛారిటీ గాలాకు హాజరైనప్పుడు ప్రిన్సెస్ డయానా ధరించింది. అయితే ఈ లాకెట్ డయానా జీవితంలో కీలక ఘట్టాన్ని, ఆమె హుందాతనాన్ని సూచిస్తుండగా.. అసలు ఎలాంటి అర్హత ఉందని కిమ్ కొనుగోలు చేసిందని విమర్శిస్తున్నారు నెటిజన్స్.
ఇవి కూడా చదవండి : ఆస్తులు తనాఖా పెట్టిన kangana Ranaut