- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ స్టార్ హీరోతో అడ్డంగా బుక్ అయిన కీర్తి సురేష్.. ఫుల్ ఎంజాయ్ చేస్తుందిగా (వీడియో)

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో పలు వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. అయితే ఈ అమ్మడు ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో ప్రేమలో పడిందని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటుందని పలు వార్తలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. వాటిపై రీసెంట్‌గా కీర్తి తండ్రి స్పందించారు. ఇదంతా ఫేక్ అని క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రమంలో తాజాగా, కీర్తి సురేష్ ఓ స్టార్ హీరోతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి ముంబైలో ఆటో రైడ్ చేసింది. అందులో వరుణ్ బనియన్‌పై ఉండగా కీర్తి మెహందీ ధరించి జీన్స్, టీ షర్ట్‌లో కనిపించింది. నవ్వుతూ అతనితో మాట్లాడుతూ తెగ ఎంజాయ్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఇదొక యాడ్ కోసం లేదా.. ఏదైనా సినిమా కోసం కావొచ్చని అనుకుంటున్నారు. అలాగే మరికొంత మంది మాత్రం వరుణ్ ఎవ్వరిని వదిలిపెట్టడంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
- Tags
- keerthy suresh