కీర్తి సురేష్, రాధిక మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట.. ఎందుకంటే.

by Aamani |   ( Updated:2023-11-24 11:24:23.0  )
కీర్తి సురేష్, రాధిక మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట.. ఎందుకంటే.
X

దిశ, సినిమా : YRF బ్యానర్‌పై ఎన్నో బ్లాక్ బస్టర్ బాలీవుడ్ ఫిల్మ్స్ వచ్చాయి. కానీ తాజాగా ఈ సంస్థ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ‘మండల మర్డర్స్’, ‘ది రైల్వే మెన్’ లాంటి ప్రాజెక్ట్స్ నిర్మించి సక్సెస్ అందుకుంది. కాగా తాజాగా ‘AKKA’ పేరుతో మరో సిరీస్‌తో రాబోతున్నట్లు తెలుస్తుంది. సౌత్ ఇండియన్ సెన్సేషన్ కీర్తి సురేశ్, యాక్టింగ్ పవర్ హౌజ్ రాధికా ఆప్టే ప్రధానపాత్రల్లో నటించనున్న రివేంజ్ థ్రిల్లర్‌కు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆరు నెలల ప్రీ ప్రొడక్షన్ వర్క్ తర్వాత ఈ వీక్‌లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సిరీస్‌లో ఈ ఇద్దరు హీరోయిన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పగ ఉంటుందని టాక్. ఇక ఈ ప్రాజెక్ట్ ద్వారా రచయిత, దర్శకుడు ధర్మరాజ్ శెట్టి పరిచయం కాబోతుండగా.. ఆదిత్య చోప్రా ఆయన టాలెంట్‌కు ఫిదా అయ్యాడని తెలుస్తుంది.

కాగా ఇప్పటికే ‘తేరీ’ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన కీర్తి.. ‘AKKA’ రూపంలో సెకండ్ ప్రాజెక్ట్ దక్కించుకుంది. ఇక ఈ సిరీస్ కచ్చితంగా తన కెరీర్‌లో బెస్ట్ అవుతుందని.. రాధికతో పోటీ పడితే మరింత ప్లస్‌ అవొచ్చని అంటున్నారు అభిమానులు. దీంతో బీటౌన్‌లో మరింత బిజీ అయిపోనుందని చెప్తున్నారు.

Advertisement

Next Story