అమ్మలక్కలతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోలేను.. ఫుల్ బిజీ అంటున్న కవిత

by samatah |   ( Updated:2023-05-12 14:20:16.0  )
అమ్మలక్కలతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోలేను.. ఫుల్ బిజీ అంటున్న కవిత
X

దిశ, సినిమా: ప్రముఖ నటి కవితా కౌశిక్ కెరీర్‌లో మళ్లీ చాలా బిజీ అయినట్లు చెప్పింది. 2006లో మొదలై 2015లో ముగిసిన ‘ఎఫ్‌ఐఆర్’ టీవీ షో 1,323 ఎపిసోడ్‌లు చేసిన ఆమె.. ఈ షో తొమ్మిదేళ్లపాటు తనను టెలివిజన్ రాజకీయాలకు దూరంగా ఉంచిందని చెప్పింది. అయితే తాజాగా మరిన్ని ప్రాజెక్టుల్లో అవకాశాలు వస్తున్నాయని, ప్రస్తుతం ‘రండి అక్కా.. కబుర్లు చెప్పుకుందాం’ అని ఎవరినీ కదిలించే పరిస్థితి లేదని వెల్లడించింది. ‘నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఎవరి మాటలు వినడం, ఎవరి గురించి పట్టించుకునే సమయం లేదు. మరింత సృజనాత్మకతతో చురుకుగా పనిని మెరుగుపరుచుకునే పనిలో ఉన్నా. నా కష్టానికి ఏదైనా అవార్డు వస్తుందో లేదో తెలియదు. కానీ, ఎవరేమీ చెప్పాలనుకున్నా.. విమర్శించాలనుకున్నా వినదలచుకోలేదు’ అని తనకు తానే డబ్బా కొట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి:

బలవంతంగా విస్కీ తాగించి.. ఆ ప్లేస్‌లో ముద్దు కావాలని వేధించాడు

Next Story