- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వాతంత్య్రం తెచ్చింది గాంధీ కాదు నేతాజీ : Kangana Ranaut షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి సంచలన కామెంట్స్‌తో వార్తల్లో నిలిచింది. నిరంతరం ఏదో ఒక ఇష్యూ లేవనెత్తుతూ తనదైన స్టైల్‌లో చిందులేసే బ్యూటీ.. తాజాగా మహాత్మ గాంధీ మనస్తత్వం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఢీల్లీలో 'రాజ్ పథ్' పేరును 'రాజ్‌పథ్ కర్తవ్యపథ్'గా పునరుద్ధరించిన ప్రారంభోత్సవానికి హాజరైన ఆమె.. 'నేను గాంధీవాదిని కాదు. నేతాజీ వాదిని. అందుకే నేను మాట్లాడితే చాలామంది ఇబ్బంది పడతారు. ప్రతి ఒక్కరికి సొంత ఆలోచనా విధానం ఉంటుంది. ఈ కారణంగా నేతాజీ, సావర్కర్ వంటి అనేకమంది విప్లవకారులు చేసిన పోరాటానికి సరైన గుర్తింపు రాలేదని అనుకుంటున్నా.
ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమని గాంధీ చెప్పారు. అందుకే నిరాహారదీక్ష, దండి కవాతు చేసి స్వాతంత్రర్య సాధించుకున్నామని అందరూ చెబుతుంటారు. అది నిజం కాదు. లక్షలాది మంది ప్రజలు ప్రాణం త్యాగం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనడం ద్వారా భారతదేశానికి స్వాతంత్రర్యం తీసుకురావాలని నేతాజీ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. దానికోసం ఆయన సైన్యాన్ని రెడీ చేశాడు. అందువల్ల బ్రిటిష్ వారిపై ఒత్తిడి పెరిగింది. దాని వల్లే దేశానికి స్వాతంత్రర్య సాధించగలిగారు' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్న రీతుల్లో స్పందిస్తున్నారు.
- Tags
- kangana ranaut