- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sonusood: ఒక్కసారి గట్టిగా హగ్ చేసుకొని నిన్ను ఎంత మిస్ అవుతున్నానో చెప్పాలని ఉంది.. సోన్‌సూద్ ఎమోషనల్ పోస్ట్
దిశ, సినిమా: రియల్ హీరో సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అన్న మాటకు అక్షరాల ఆచరణలో పెడుతున్నాడు ఈ స్టార్ హీరో. సినిమాల్లో విలన్ పాత్రలు చేసి.. కరోనా సమయంలో వేల మందికి సాయం చేసి రియల్ హీరోగా జనాల్లో పాతుకుపోయాడు. సహాయం కావాలని చేయి చాపితే చాలు చేయూత అందిస్తున్నాడు. కరోనా పరిస్థితులు మెరుగుపడినా సమాజ సేవలు అందిస్తున్నారు. తన తల్లి సరోజ్ సూద్ పేరుతో స్కాలర్‌షిప్‌లు అందించేందుకు 2022లో నడుంబిగించాడు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఇదిలా ఉంటే నేడు సోనూసూద్ తల్లి సరోజ సూద్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ పోస్ట్‌లో భాగంగా.. హ్యాపీ బర్త్‌డే అమ్మా.. నువ్వు లేని ఈ ప్రపంచం అంత అందంగా లేదు.. కానీ నువ్వు చూపించిన మార్గంలోనే ఇప్పటికి నడుస్తున్నాను, అలాగే నడుస్తాను కూడా. నువ్వు నేర్పిన సూత్రాలు, నైతిక విలువలతో జీవనం కొనసాగిస్తున్నాను. ఒక్కసారి నిన్ను గట్టిగా హత్తుకొని ఎంతగా మిస్ అవుతున్నానో చెప్పాలని ఉంది. మళ్లీ నిన్ను నేను చూసేవరకు నవ్వుతూ ఉండు.. అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
(video link credits to sonu sood instagram id)