- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
JR.NTR 30: NTR 30 నుంచి బిగ్ అప్డేట్.. అభిమానులకు పండగే!
దిశ,వెబ్ డెస్క్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ కోసం మార్చి 6 న అమెరికాకు వెళ్లనున్నాడు. మార్చి 12 న ఆస్కార్ ఈవెంట్ ఉంది.. ఆ తరవాత ఎన్టీఆర్ ఇండియాకు తిరిగి రానున్నారు. వచ్చిన తరవాత NTR 30 మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నాడట. ఫిబ్రవరిలోనే మొదలు కావాలిసిన ఈ ప్రాజెక్ట్ తారక రత్న మరణంతో వాయిదా పడింది. మార్చి మూడో వారంలో కొబ్బరి కాయ కొట్టి.. ఏప్రిల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా నుంచి రెండు రోజుల్లో అప్డేట్ రాబోతుందని ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం.
ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకున్నట్టు చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఈ విషయం పై అధికారికంగా ప్రకటన రాలేదు. మార్చి 6 న ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ రానుంది. ఆ రోజు ఎన్టీఆర్ అమెరికాకు వెళ్తున్నారుగా.. అప్డేట్ ఎలా వస్తుందని ఆలోచిస్తున్నారా ? ఇక్కడే ఉంది అసలు మ్యాటర్..మార్చి 6 న జాన్వీ కపూర్ పుట్టిన రోజు, ఈ సంధర్భంగా NTR 30 లో ఈ ముద్దు గుమ్మను కన్ఫర్మ్ చేసినట్లు అధికారికంగా వెల్లడించనున్నారట. దీనికి సంబందించిన ఫోటో షూట్ కూడా కంప్లిట్ అయ్యిందట. ఈ సినిమా నుంచి జాన్వీ లుక్ విడుదల చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి : SSMB 28: మహేష్ SSMB 28 కు ఇంత క్రేజ్ ఏంటి స్వామి!