Jawan Teaser : రిలీజ్ డేట్ లాక్.. షారుక్ అభిమానులకు పండుగే..!

by Dishaweb |   ( Updated:2023-06-28 08:49:38.0  )
Jawan Teaser :  రిలీజ్ డేట్ లాక్.. షారుక్ అభిమానులకు పండుగే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : పఠాన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన పూర్వవైభవం అందుకున్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. అదే ఉత్సాహన్ని కొనసాగిస్తూ నటిస్తున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ 'జవాన్'.అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 7న టీజర్ ని విడుదల చేయనున్నారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.ఈ సినిమాలో షారుఖ్ సరసర నయనతార నటిస్తుండగా, దీపికా పదుకొనె అతిథి పాత్రలో నటిస్తుంది.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.'జవాన్' సినిమాలో కోలీవుడ్ స్టార్స్ పెద్ద ఎత్తున ఉండడంతో హిందీతో పాటు తమిళ్ ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.పఠాన్ తర్వాత, షారుక్ ఖాన్ మరో బ్లాక్ బస్టర్ అందించడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు" అని బాలీవుడ్ వర్గాల్లోచర్చ నడుస్తోంది.

Read More: పూలు అమ్ముకునే మహిళకు షాక్ ఇచ్చిన అమితాబ్.. ఒక్క బొకేకు ఎంత ఇచ్చాడంటే

Advertisement

Next Story