ఎన్టీఆర్ కోసం దేశాలు దాటిన జపాన్ యువతి

by Y. Venkata Narasimha Reddy |
ఎన్టీఆర్ కోసం దేశాలు దాటిన జపాన్ యువతి
X

దిశ, వెబ్ డెస్క్ : అభిమాన హీరోను కలువాలన్న కోరిక ఆమెను దేశాలు దాటించింది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమా చూసేందుకు ఓ యువతి టోక్యో నుంచి లాస్ ఏంజెల్స్ కు వెళ్ళింది. అక్కడ తన అభిమాన హీరోను కలుసుకుని మురిసిపోయింది. తన కోసం ఏకంగా దేశాలు దాటి వచ్చిన ఆ జపాన్ అభిమానితో తారక్ ముచ్చట్ల వీడియో వైరల్ గా మారింది. దేవర ఇండియాలోనే కాకుండా పలు దేశాల్లో సెప్టెంబర్ 27న విడుదలైన సంగతి విదితమే. నార్త్ అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోనూ మూవీ ప్రదర్శితమవుతోంది. లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్‌లో ప్రదర్శితమైన తొలి భారతీయ చిత్రంగా దేవర నిలిచింది. ఈ సినిమాను అక్కడ వీక్షించేందుకు వెళ్ళిన ఎన్టీఆర్ పట్ల ఓ జపాన్ యువతి చూపిన అభిమానానికి యంగ్ టైగర్ ఫిదా అయ్యారు. దేవర మూవీని చూసేందుకు జపాన్‌కు చెందిన ఆ యువతి ఏకంగా రాజధాని టోక్యో నుండి లాస్ ఏంజెల్స్ వచ్చి బియాండ్ ఫెస్ట్‌లో సినిమా వీక్షించింది. ఈ రెండు దేశాల మధ్య దూరం 8 వేల కిలో మీటర్లు పైమాటే. తన కోసం దేశాలు..ఖండాలు దాటి వచ్చిన జపాన్ అభిమానితో ఎన్టీఆర్ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆమె అతడ్ని చూడగానే భావోద్వేగానికి గురైంది. ‘మీ కోసం మేమంతా ఎదురు చూస్తున్నామని..మీరు జపాన్ రావాలి అంటూ’ జూనియర్ ఎన్టీఆర్‌ను కోరింది. ఆమె అభ్యర్ధనకు స్పందించిన ఎన్టీఆర్ తాను జపాన్ వస్తానంటూ హామీనిచ్చారు. దీంతో ఉబ్బితబ్బిబ్బు అయిన మహిళా అభిమాని ఆనంద భాష్పాలతో తన కృతజ్ఞతలు తెలిపింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. తారక్- జపాన్ మహిళ మధ్య జరిగిన చిన్నచిట్ చాట్.. జూనియర్ ఎన్టీఆర్‌ జపాన్ అభిమానుల్లో ఉన్న ఫ్యాన్ క్రేజ్ ను చాటుతుంది. ప్రపంచ వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో పోల్చితే జపాన్‌లో ఆయన పట్ల ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తారక్ నటించిన పలు చిత్రాలు జపాన్ లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచాయి. జపాన్ ప్రజల అభిమాన హీరోగా మారాడు. ముఖ్యంగా ఆ దేశంలో తారక్ కు మహిళాభిమానుల ఫాలోయింగ్ ఎక్కువే. గతంలో యంగ్ టైగర్ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం జపాన్‏ కు వెళ్ళిన సందర్భంలో అది స్పష్టమైంది. తారక్ ను కలిసేందుకు భారీగా లేడీ ఫ్యాన్స్ వచ్చి ఆయనతో సెల్ఫీలతో సందడి చేసి తమ అభిమానం చాటుకున్నారు. ఇప్పటికే విడుదలైన దేవర సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ కలక్షన్లలో దూసుకుపోతోంది.

దేవర మూవీ రివ్యూ

Advertisement

Next Story

Most Viewed