Rithu chowdary: హైపర్ ఆది వల్లే జబర్దస్త్ మానేశా.. ఛాన్స్ అడిగితే నన్ను అలా చేయమన్నారు.. రీతు చౌదరి షాకింగ్ కామెంట్స్

by Kavitha |
Rithu chowdary: హైపర్ ఆది వల్లే జబర్దస్త్ మానేశా.. ఛాన్స్ అడిగితే నన్ను అలా చేయమన్నారు.. రీతు చౌదరి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయిన వారు చాలామంది ఉన్నారు. అలా పాపులారిటీ తెచ్చుకొని సినిమాల్లో అవకాశాలను సైతం దక్కించుకుంటున్నారు. అలాగే ఈ షో ద్వారా పరిచయం అయి నేడు బుల్లితెర మీద రాణిస్తున్న వారు కూడా ఉన్నారు. వారిలో రీతు చౌదరి కూడా ఒకరు. ఈమె కెరీర్ తొలినాళ్లలో ‘గోరింటాకు’, ‘మిస్టర్ పెళ్లి కొడుకు’, ‘కుటుంబ సభ్యులు’, ‘సూర్యవంశం’, ‘ఇంటి గుట్టు’ వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. తర్వాత ‘కేరింత’, ‘సరైనోడు’, ‘రామ లీల’ వంటి సినిమాల్లో కూడా నటించింది. ఇలా సినిమాలు, సీరియల్స్ చేస్తూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ జబర్దస్త్ షోకి సైతం వచ్చింది. అందులో హైపర్ ఆది టీమ్‌లో తనదైన రీతిలో అలరించింది. దీంతో ఈ అమ్మడుకు ఆ షోలో వరుస అవకాశాలు లభించాయి. తద్వారా ఈమె గ్రాఫ్ మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే రీతుకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం కిలాడీ గర్ల్స్, కిరాక్ బాయ్స్ అనే షోలో చేస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రీతు చౌదరి జబర్దస్త్ మానేయడానికి.. అలాగే సినిమాల్లో ఛాన్స్‌ల గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘హైపర్ ఆది వల్లనే నాకు ఇంత పేరు వచ్చింది. ఇక ఆది జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో నాకు ఆ షోకు వెళ్లాలనిపించలేదు. హైపర్ ఆది లేనప్పుడు నేను అక్కడ ఏం చేయాలి. అతను వెళ్ళిపోయాడు కాబట్టే నేను కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసాను’ అని చెప్పుకొచ్చింది. తర్వాత రీతూ చౌదరి కంటిన్యూ చేస్తూ.. 'నాకు ఇప్పుడు చాలా షోలలో అవకాశాలు వస్తున్నాయి. అలాగే, సినిమా ఛాన్స్‌లు కూడా వస్తున్నాయి. కానీ, అందులో చాలా మంది నాకోసం బోల్డ్ క్యారెక్టర్లనే ఆఫర్ చేస్తున్నారు. పైగా నువ్వు బయట బోల్డ్ గానే ఉంటావు కదా చెయ్ అంటున్నారు. అది నచ్చని కారణంగానే సినిమాలు చేయడం లేదు' అంటూ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story