Devara తో OG పోటీ అంటే సాహసం అనే చెప్పాలి.. వైరల్ అవుతున్న Sri Reddy కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-08-14 04:15:55.0  )
Devara తో OG పోటీ అంటే సాహసం అనే చెప్పాలి.. వైరల్ అవుతున్న Sri Reddy కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హాట్ బ్యూటీ శ్రీరెడ్డికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా మెగా ఫ్యామిలీపై పలు పోస్టులు చేస్తూ దుమారం రేపుతోంది. తాజాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుందని తెలుస్తోంది. అలాగే పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓజీ కూడా సమ్మర్‌లోనే రిలీజ్ కానుండటం గమనార్హం. ఈ రెండిటిని ఉద్దేశించి శ్రీరెడ్డి కామెంట్లు చేసింది. ‘‘రెండు వారాల గ్యాప్ లోనే, మొదట తమ్ముడు సినిమా, తర్వాత అన్నయ్య సినిమా, దొందు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఎలాంటి పోటీ లేకుండా ఉంటేనే, ఇలా ఫ్లాప్ అయ్యాయి అంటే, ఇంకా ఏప్రిల్ లో దేవర తో పోటీ అంటే సాహసం అనే చెప్పాలి’’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన మా హీరోలను తక్కువగా అంచనా వేయొద్దని ఫైర్ అవుతున్నారు.

Also Read: ఆ స్టార్ హీరోయిన్ మీద కోపంతో బాటిల్ పగలగొట్టా.. Rana సంచలన కామెంట్స్

Advertisement

Next Story