- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేశ్ తన పేరుకు తండ్రిపేరు యాడ్ చేయడం వెనుక ఇంత పెద్ద అవమానం జరిగిందా?
దిశ,సినిమా: ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మని నల్లగా ఉందంటూ విమర్శలు చేసారు కానీ నేడు అవకాశాలే ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. అవమానపడిన చోటే గెలుస్తా అంటూ సినీ రంగంలోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేశ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న తనంలోనే తండ్రిని పోగొట్టుకుని ఎన్నో కష్టాలు పడి కుటుంబానికి అండగా నిలిచి ఇప్పుడు హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇంత వరకు ఈ ముద్దుగుమ్మ గ్లామర్ రోల్స్ చేయలేదు. ఈ మధ్యనే గ్లామర్ ఫొటో షూట్స్ చేస్తూ ఫోటోలను షేర్ చేస్తుంది.
సినీ రంగంలోకి అడుగు పెట్టి జూనియర్ ఆర్టిస్టుగా చేసేటప్పుడు తనను దారుణంగా చూసారని.. వాటి నుంచి చాలా నేర్చుకున్నాను ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఏదొక రోజు మూవీలో చేసే ఛాన్స్ వస్తుందని నా పైన నమ్మకంతో అడుగులు వేసా.. అని చెప్పగా అప్పుడు యాంకర్ మీది ఓవర్ కాన్ఫిడెన్స్ నా లేక కాన్ఫిడెన్స్ నా అని అడిగితే.. నన్ను నేను నమ్ముతున్నాను నాకు రంగు తప్ప టాలెంట్ ఉంది.
ఒక మనిషిని అందంగా చూపించడానికి ఇదొక్కటి చాలు ఇంకేమి అవసరం లేదు. నా టాలెంట్ తోనే మూవీస్ లో అవకాశం తెచ్చుకోవాలని అనుకున్నాను అలాగే సంపాదించాను. మీకు తెలియని విషయం ఏమిటంటే నేను చాలా వరకు మేకప్ వేసుకోను అని చెప్పుకొచ్చింది. సినీ ఇండస్ట్రీలో మా నాన్న పేరు చెబితే వచ్చే ఆఫర్స్ కూడా రావంటూ నన్ను భయపెట్టి అవమానించారు.. అదే క్షణం డిసైడ్ అయ్యా నా తండ్రిపేరుతోనే సినిమాలు చేయాలని అలా నా నేమ్ లో నాన్న పేరు యాడ్ చేసా అని తన మాటల్లో చెప్పుకొచ్చింది.