1990లో చిరు భారీ పారితోషికం.. బిగ్‌ బి కన్నా కూడా బిగ్గర్.. ఇదిగో సాక్ష్యం..

by sudharani |   ( Updated:2023-03-18 06:43:57.0  )
1990లో చిరు భారీ పారితోషికం.. బిగ్‌ బి కన్నా కూడా బిగ్గర్.. ఇదిగో సాక్ష్యం..
X

దిశ, సినిమా: 1978వ సంవత్సరంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి.. ‘పునాది రాళ్లు’ చిత్రంతో సినీ ప్రస్థానం మొదలుపెట్టాడు. తన నటనా ప్రతిభతో దేశ వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం కొడుకు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన వేళ.. చిరు అభిమానులు తమ హీరో గొప్పతనం గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఆయన రెమ్యునరేషన్‌కు సంబంధించిన వార్తలు వైరల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే చిరు తొలి సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ కేవలం రూ. 1,116 రూపాయలు. కాగా అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ, నటనా పరంగా సత్తాచాటుతూ.. మెగాస్టార్‌గా ఎదిగాడు. 1990 నాటికి రూ.1.25 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నాడు. ఆ సమయంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ కూడా అంత రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఈ క్రమంలో ఇంత పెద్ద మొత్తంలో భారీ పారితోషికం తీసుకున్న ఇండియన్ హీరోగా చరిత్ర సృష్టించాడు చిరు. కాగా ఈ న్యూస్‌ 1992లో ‘ది వీక్’ అనే మ్యాగజైన్‌లో ‘బిగ్గర్ ద్యాన్ బచ్చన్’ పేరుతో ప్రచురితమైంది. ఈ మ్యాగజైన్‌ కవర్ పేజీలో చిరు దర్శనమివ్వడం మరో విశేషం.

Read more:

ఆగలేకపోయిన యువతి.. లోకల్ ట్రైన్‌లో ప్రియుడుతో ఏకంగా ఆ పని చేస్తూ.. (వీడియో)

Advertisement

Next Story

Most Viewed