- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ టాలీవుడ్ హీరోకు నేను పెద్ద ఫ్యాన్.. ఆయన సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చినా చేస్తా: రణ్‌బీర్
దిశ, సినిమా: నందమూరి బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. రీసెంట్గా అప్ కమింగ్ పాన్ ఇండియా మూవీ ‘యానిమల్’ టీం ప్రమోషన్లలో భాగంగా ఈ షోకు హాజరైంది. రణ్‌బీర్‌తో పాటు హీరోయిన్ రష్మిక మందన్న, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ షోలో సందడి చేశారు. చాలా విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రణ్‌బీర్ కపూర్.. తెలుగు ఇండస్ట్రీలో తనకు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలని ఉందో చెప్పుకొచ్చాడు.
‘నాకు ప్రభాస్‌తో స్నేహం చేయాలని ఉంది. ఎందుకంటే నేను ఆయనకు అభిమానిని. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం నాకు రష్మిక, సందీప్ స్నేహితులు. సందీప్ తర్వాతి సినిమా ప్రభాస్ అన్నతో ఉంది. అందుకే నాకు తన మూవీలో చిన్న రోల్ ఇచ్చినా కూడా చేస్తాను’ అని రణ్‌బీర్ తెలిపాడు. దీంతో పక్కనే ఉన్న రష్మిక చప్పట్లు కొట్టింది. ఇక వీరి ‘యానిమల్’ మూవీ డిసెంబర్ 1న హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల కానుంది.