ఇకపై అలాంటి పాత్రలో నటించను : Vijay Sethupathi

by Prasanna |   ( Updated:2023-01-07 07:40:56.0  )
ఇకపై అలాంటి పాత్రలో నటించను : Vijay Sethupathi
X

దిశ, సినిమా : సౌతిండియాలోని బిజియెస్ట్ స్టార్స్‌లో విజయ్ సేతుపతి ఒకరు. భాషతో సంబంధం లేకుండా, వైవిధ్యమైన సినిమాలతో, విభిన్నమైన పాత్రలలో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గతేడాది విజయ్ సేతుపతి హీరోగా 'కాతు వాకుల రెండు కాదల్' సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. మరొకవైపు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన 'విక్రమ్' సినిమాలో కూడా గెస్ట్ పాత్రలో మెరిశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. మరో వైపు మలయాళంలో నటించిన '19(1)(a)' కూడా నిరాశపరిచింది. ఇలా హీరోగా నటిస్తూనే, విలన్ పాత్రలు పోషిస్తుండటంతో, కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో విజయ్ సేతుపతిని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక‌పై అతిథి పాత్రలు నటించకూడదని విజయ్ నిర్ణయించుకున్నాడట. రోల్ బాగుంటేనే ఇలాంటి పాత్రలకు సై అనాలనుకుంటున్నాడట. ఒక్క ఏడాదిలో కోలీవుడ్‌లో మూడు చిత్రాలు, ఇతర భాషలో మరో చిత్రం చేయాలనుకుంటున్నాడని విజయ్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీన్నిబట్టి చూస్తే 2023 నుంచి విజయ్ తక్కువ సినిమాల్లో మాత్రమే కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read..

'Okkadu'మూవీ రీ రిలీజ్..ఎన్ని థియేట‌ర్లలో విడుదలవుతోందంటే

Advertisement

Next Story

Most Viewed