ఆ మాటలు పడలేక చచ్చిపోదామనుకున్న.. నటి వరలక్ష్మి శరత్ కుమార్

by sudharani |   ( Updated:2023-03-05 15:26:17.0  )
ఆ మాటలు పడలేక చచ్చిపోదామనుకున్న.. నటి వరలక్ష్మి శరత్ కుమార్
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో హిట్ మూవీస్ తీసినప్పటికీ నటనా పరంగానూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలి. అలాంటప్పుడే ఇంకా ఫేమ్‌ అవుతారు. తాజాగా నటి వరలక్ష్మి శరత్ కుమార్.. తాను నటనా పరంగా చాలా రకరకాల ట్రోలింగ్స్‌ను ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క మూవీలో ఆమె విలన్‌గా నటిస్తూ ఆకట్టుకుంటోంది. అయితే రీసెంట్‌గా బాలయ్య నటించిన ‘వీర సింహ రెడ్డి’ మూవీ‌తో మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సందర్భంగా ఆమె తాను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఎదుర్కొన్న కామెంట్లను గురించి తెలిపింది. ‘‘చూడటానికి చాలా లావుగా ఉంది. యాక్టింగ్ రాదు, ఏం రాదు’ అంటూ మొదట్లో చాలా కామెంట్స్ వచ్చాయి. వాటివల్ల నాకు చాలా బాధ అనిపించేది. ఒక్కోసారి సూసైడ్ కూడా చేసుకోవాలనిపించేది. కానీ ఈ కామెంట్ చేసేవాళ్లకి నేనేంటో నా యాక్టింగ్ ఏంటో సినిమాల్లో చేసి చూపించాలనే సంకల్పంతో ముందుకు వచ్చాను’’ అని తెలిపింది. అనుకున్నట్టుగానే ప్రతీ ఒక్క మూవీ‌లో తన నటనతో అదరగొడుతోంది.

ఇవి కూడా చదవండి : ఈ రెండు కారణాల వల్లే విడాకులు పెరిగిపోతున్నాయి: ఆర్‌జీవీ

Advertisement

Next Story