- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా.. నా హృదయంలో ఎప్పటికీ నిలిచి పోతావ్.. రష్మి భావోద్వేగ పోస్ట్
దిశ, సినిమా: బుల్లితెర యాంకర్ రష్మి జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయి హీరోయిన్ రేంజ్‌లో పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత సుడిగాలి సుధీర్‌తో కలిసి పలు షోలు జంటగా చేసింది. అంతటితో ఆగకుండా కొన్నిసార్లు స్సెషల్ షోస్‌తో పెళ్లి కూడా చేసుకున్నారు. దీంతో ప్రేక్షకుల్లో ఈ జంటకు ప్రత్యేకమైన క్రేజ్ వచ్చింది. నిజజీవితంలో ప్రేమించుకుంటున్నారని.. పెళ్లి కూడా చేసుకుంటారని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని వారు క్లారిటీ ఇవ్వడంతో అలాంటి రూమర్లకు చెక్ పడ్డాయి. అయితే రష్మి పలు సినిమాల్లోనూ నటించి అందరినీ మైమరిపించింది. ప్రస్తుతం యాంకర్‌గా పలు షోలు చేస్తూ.. బుల్లితెరపై రాణిస్తోంది.
అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ.. పలు ఆసక్తికర పోస్టులతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా, రష్మి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన పెట్ డాగ్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. అది చనిపోయి నెల పూర్తి కావొస్తోంది.. దీంతో రష్మి ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘ఇప్పుడు సరిగ్గా ఒక నెల నా సాసీ యువరాణి నన్ను విడిచి వెళ్లిపోయి. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను నా చుట్కీ. మార్చి 9వ తేదీ వెళ్లిపోయావు.. కానీ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతావు. నువ్వు వద్దకు తిరిగి వస్తావని నాకు తెలుసు, వీడ్కోలు శాశ్వతం కాదు. అప్పటి వరకు నాకు ఉన్నదల్లా ఈ జ్ఞాపకాలు గతంలో కంటే విలువైనవిగా మారాయి’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.