- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్లు అర్జున్, రామ్ చరణ్ ల డేట్స్ కోసం వెయిట్ చేసి తప్పు చేశాను :Prasanth Varma
దిశ, సినిమా: ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హనుమాన్ ’ మూవీ ఎలాంటి విజయం అందుకుందో చెప్పక్కర్లేదు. సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు ఉన్నప్పటికీ వెనక్కి తగ్గలేదు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇక తన సినిమాపై పెట్టుకున్న నమ్మకం ఏకంగా రూ. 250 కోట్లకు పైగా వసూలు సాధించి, 300 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. ఈ మూవీ హిట్ విషయం పక్కన పెడితే దర్శకుడు ప్రశాంత్ వర్మ మీద రోజుకొక వార్త వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా ‘చాలా రోజుల వరకు రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోల డేట్స్ కోసం వెయిట్ చేసి తప్పు చేశాను’ అంటూ ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు..అని ఒక వార్త వైరల్ గా మారిపోయింది.
దీంతో ఇరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ప్రశాంత్ పై ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించి ‘రామ్ చరణ్, అల్లు అర్జున్ డేట్స్ కోసం చాలా రోజులుగా వెయిట్ వెయిట్ చేసి తప్పు చేశాను అని.. నేను చెప్పినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. వీరి పేర్లను ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. నాకు వారిద్దరు అంటే మంచి అభిమానం ఉంది. కథ దొరికితే తప్పకుండా ఎప్పటికైనా వారితో సినిమా చేస్తాను.దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం ఆపండి’ అంటూ ప్రశాంత్ వర్మ రిక్వెస్ట్ చేశారు.