నాకు మార్కులు రాలేదని ఆ కాలేజీలో సీటు ఇవ్వలేదు: సూపర్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

by Anjali |   ( Updated:2023-08-11 13:10:45.0  )
నాకు మార్కులు రాలేదని ఆ కాలేజీలో సీటు ఇవ్వలేదు: సూపర్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మషేష్ బాబుకు తక్కువ మార్కులు రావడం వల్ల తనకిష్టమైన కాలేజీలో సీటు రాలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘నేను ఇంటర్ చదువుతున్నప్పుడు కాలేజీకి వెళ్లకుండా ఎక్కువగా సినిమాలు చూసేవాడిని. దీంతో మా నాన్న చదువు మొత్తం పూర్తయిన తర్వాతే సినిమాల్లోకి అడుగు పెట్టాలని చెప్పేవాడు. అప్పటి నుంచి సినిమాలు చూడడం తగ్గించి.. చదువుపై శ్రద్ధ పెట్టి చదువుకున్నాను. తర్వాత డిగ్రీలో నాకు ఇష్టమైన లయోల కళాశాలలో సీటు రావడానికి చాలా ప్రయత్నించాను. కానీ ఇంటర్‌లో సరైన మార్కులు రాలేదని నాకు సీటు ఇవ్వలేదు. దాంతో చాలా డిసప్పాయింట్ అయ్యాను. తర్వాత మళ్లీ కష్టపడి ఆ కాలేజీలో సీటు సంపాదించాను. చదువు కంప్లీట్ అయ్యాక మళ్ళీ సినిమాలపై దృష్టి సారించి రాజకుమారుడు చిత్రంతో మొదటిసారి హీరోగా టాలీవుడ్ పరిశ్రమకు పరిచయమయ్యాను. అప్పటి నుంచి ఇండస్ట్రీలోనే నా ప్రయాణం సాగుతోంది’’ అంటూ ప్రిన్స్ చెప్పుకొచ్చాడు.

Read More: అదే ఆఖరు సినిమా.. ఇక చెయ్యకూడదని నిర్ణయించుకున్న: వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Advertisement

Next Story