- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ హీరోను అందరి ముందు ఘోరంగా అవమానించిన మీనా తల్లి..
దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు తెలుగు తెరపై మంచి ఫాలోయింగ్ ఉన్న నటి మీనా. తన అందంతో, మంచి నటనతో దాదాపుగా అందరూ స్టార్ హీరోల సరసన నటించి మొప్పించింది మీనా. వివాహం అనంతరం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సరే ఆమె అందంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఇక గత సంవత్సరం భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన మీనా.. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుని సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. ఇదిలా ఉంటే.. మీనా తల్లి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే..
మీనా తెలుగులోనే కాదు.. తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే తమిళనాట రజినీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న స్టార్ హీరో అజిత్‌తో కలిసి ‘ఆపంద పూంకట్రు’ అనే సినిమా తీసింది మీనా. ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకోగా.. అజిత్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఈ అవార్టు మీనా చేతిల మీదుగా అజిత్ తీసుకున్నారు. ఆ సందర్భంలో అజిత్, మీనాకు కలిసి స్టేజ్‌పై డాన్స్ చేయాలని యాంకర్ కోరింది. ఆ మాట విన్న మీనా తల్లి వెంటనే స్టేజ్‌పైకి వచ్చి అమాంతం మీనా చేయి పట్టుకుని స్టేజ్ నుంచి కిందకి తీసుకెళ్లిపోయింది. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారంతా ఒక్క సారిగా షాక్ అయ్యారు. హీరో అజిత్ అయితే అది అవమానంగా ఫీల్ అయ్యారు. ఇక ఆయన ఫ్యాన్స్ అయితే మా అభిమాన హీరోని అందరి ముందు ఘోరంగా అవమానించింది అంటూ మీనా తల్లిపై ఓ రేంజ్లో మండిపడ్డారు. అప్పుడు జరిగిన ఈ విషయం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More... లాంగ్ గ్యాప్‌కు కారణం చెప్పుకొచ్చిన సాయి పల్లవి
నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టొద్దు! ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు క్షమాపణ చెప్పిన.. సునిశిత్