మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతులమీదుగా ‘హర్’ ట్రైలర్

by Prasanna |   ( Updated:2023-10-02 09:46:21.0  )
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతులమీదుగా ‘హర్’ ట్రైలర్
X

దిశ, సినిమా: ‘చిలసౌ’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రుహాని శర్మ. మొదటి చిత్రంతోనే తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఆమెకు ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా వరించింది. ఇక తాజాగా ఈ బ్యూటీ ఇప్పుడు థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయింది. రుహానీ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘హర్’. పూర్తిస్థాయి లేడీ ఓరియెంటెడ్ మూవీగా ఇది తెరకెక్కుతుండగా ఆమె పవర్ ఫుల్ పోలీసు అధికారిగా కనిపించనుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ చిత్రం జూలై 21న విడుదలకానుంది. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఒక అమ్మాయి మర్డర్‌తో ప్రారంభమవగా.. ఓవరాల్‌గా ఈ ట్రైలర్ మూవీ‌పై ఆసక్తి కలిగించింది.

Advertisement

Next Story