- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లైంగిక వేధింపుల కేసు: నిర్మాతకు 24 ఏళ్ల జైలు శిక్ష
దిశ, సినిమా : ప్రముఖ హాలీవుడ్ నిర్మాత, మీటూ ఉద్యమంలో మొదటి దోషిగా తేలిన హార్వే వేన్‌స్టీన్ మరో రేప్ కేసులో దోషిగా తేలాడు. 2013లో ఓ ఇటాలియన్ నటి, మోడల్‌పై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు నిర్ధారణ కావడంతో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టు శిక్షార్హుడిగా ప్రకటించింది. అంతేకాదు 2004 నుంచి 2013 వరకు నలుగురు మహిళలను ఏడుసార్లు సెక్స్ కోసం ఇబ్బంది పెట్టినట్లు వచ్చిన ఆరోపణల్లో 3 నేరాలు నిర్ధారణ కావడంతో..కోర్టు 24 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వేన్‌స్టీన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ..'వేన్‌స్టీన్ నిర్దోషి. తమ కెరీర్‌కు సహాయం చేస్తాడని సదరు మహిళలు వేన్‌స్టీన్‌తో ఇష్టపూర్వకంగానే సంబంధాలు పెట్టుకున్నారు. రెండు కేసుల్లో వచ్చిన లైంగిక ఆరోపణలు పూర్తిగా కల్పితాలే' అని అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే బాధిత మహిళలు బలమైన సాక్షాలు సమర్పించడంతో నేరాలు రుజువు కాగా..ఇప్పటికే ఓ మహిళపై అత్యాచారం కేసులో భాగంగా 23 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న వేన్ స్టీన్‌కు మరో దెబ్బ పడింది. ఇదిలావుంటే..ఆయన ఇప్పటి వరకు దాదాపు 80 మంది మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు.
Also Read....