వివాహ ముహూర్తం‌, వరుడి వివరాలు బయటపెట్టిన Hansika Motwani

by sudharani |   ( Updated:2022-11-02 08:46:44.0  )
వివాహ ముహూర్తం‌, వరుడి వివరాలు బయటపెట్టిన Hansika Motwani
X

దిశ, సినిమా : యంగ్ ఏజ్‌లోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి హన్సిక. కొద్ది రోజులుగా మీడియాలో తన పెళ్లికి సంబంధించిన వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ వార్తలకు తాజాగా పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చేసింది. ప్రముఖ వ్యాపారవేత్త సోహాల్ కతూరియాను పెళ్లి చేసుకోబోతోంది హన్సిక. గతంలో వీరిద్దరూ కలసి ఒక బిజినెస్‌ ప్రారంభించారు.

అదే సమయంలో ఆలోచనలు, అభిరుచులు కలవడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇదిలా ఉంటే.. వీరి వివాహం డిసెంబర్ 4న రాజస్థాన్‌ జైపూర్‌లోని 450 ఏళ్ల పురాతన రాచకోట 'ముందోతా ఫోర్ట్‌ ప్యాలెస్‌'లో అంగరంగా వైభవంగా జరగనుందని హన్సిక అనౌన్స్ చేసింది. అలాగే అతిథుల కోసం హోటల్‌లోని అన్ని గదులు, సూట్స్‌ను బుక్ చేశారని తెలుస్తుండగా.. పెళ్లికి రెండు రోజుల ముందు నుంచే సంగీత్, మెహిందీ కార్యక్రమాలు జరగనున్నాయి.


Next Story

Most Viewed