- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఓటీటీ సెన్సార్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. హద్దుమీరితే జరిగేదిదే?
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ఓటీటీ కంటెంట్ హద్దు దాటుతుండటంతో తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇష్టారీతిన శృంగారం, వయోలెన్స్, బూతులను ఓటీటీ వేదికలు విడుదల చేస్తున్నాయి. క్రియేటివిటీ పేరుతో ఓటీటీల్లో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీ కంటెంట్ ను సెన్సార్ చేసేందుకు యూకే ప్రభుత్వం ముసాయిదాను సిద్ధం చేసింది. ఇది ఆమోదం పొందితే, ప్రముఖ ఓటీటీ వేదికలైన నెట్ ఫ్లిక్స్, డిస్నీ + హాట్ స్టార, అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారమ్యే ప్రతి కంటెంట్ ను సెన్సార్ చేస్తారు.
నిబంధనలను అతిక్రమిస్తే మన కరెన్సీలో రూ.2కోట్లు చెల్లించాల్సి ఉంటుందని యూకే ప్రభుత్వం తెలిపింది. అయితే ఓటీటీకి మన దేశంలో సైతం విపరీతమైన క్రేజ్ ఉంది. 12 కోట్ల మంది సబ్ స్క్రిప్షన్ తీసుకుని ఓటీటీల ద్వారా వారికి నచ్చిన కంటెంట్‌ను వీక్షిస్తున్నారు. అయితే ఓటీటీల్లో వస్తున్న అశ్లీల కంటెంట్ మన దేశంలో కలవరపెడుతోంది. ఓటీటీ వేదికల గురించి ఇటీవల కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ..స్వేచ్ఛ కేవలం క్రియేటివిటీకి మాత్రమే నని అశ్లీలతకు కాదన్నారు. హద్దు మీరితే గవర్నమెంట్ జోక్యం చేసుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఓటీటీ కంటెంట్ పర్యవేక్షణ, నిబంధనల్లో మార్పుల గురించి ఐటీశాఖ పరిశీలిస్తుందన్నారు. సినిమాలకు లాగానే ఓటీటీ కంటెంట్ ను సెన్సార్ చేయాలని వాదన ఇటీవల బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఓటీటీలో విడుదలైన రానానాయుడు విషయంలో చాలా మంది ఈ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి: Upasana: ఉపాసన హ్యాపీగా ఉండటమే ఇంపార్టెంట్ అంటూ పేరెంట్స్ మాట దాటవేస్తున్న చరణ్