- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
'Mangampet : విజువల్ ట్రీట్‌గా ‘మంగంపేట’ గ్లింప్స్..
దిశ, సినిమా: చంద్రహాస్ కే, అంకిత సాహా కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘మంగంపేట’. భాస్కర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి గౌతం రెడ్డి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘ఈశ్వర్.. 20 ఏళ్లు అయిందిరా.. ఊరిని చూడాలనిపిస్తుందిరా.. చూపిస్తావా?..’, ‘కొన్ని రోజులు ఆగమ్మా.. ఊరినిండా రాక్షసులే ఉన్నారు.. వాళ్లని చంపి.. ఊరిని చూపిస్తానమ్మా..’, ‘చంపాల్సింది రాక్షసుల్ని కాదు.. రావణుడ్ని..’,‘రాముడు రాలేకపోవచ్చు.. శివుడు శూలాన్ని పంపిస్తే.. చేయాల్సింది యుద్దం కాదు.. శివ తాండవం..’ అంటూ సాగిన డైలాగ్స్.. చూపించిన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. హీరో చంద్రహాస్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అయితే మాస్ ఆడియెన్స్‌కు ట్రీట్ ఇచ్చేలా ఉన్న ఈ గ్లింప్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. ఈ చిత్రంలో నాగ మహేష్, కబీర్ దుహన్ సింగ్, కాలకేయ ప్రభాకర్, దయానంద్ రెడ్డి, ఎస్టర్ నోరోన్హా, పృధ్వీరాజ్, అడుకలం నరేన్, సమ్మెట గాంధీ, 14 రీల్స్ నాని, ఈశ్వర్ రాజనాల, సమీర్, దొరబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.