- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అమ్మాయిలు ఫ్యామిలీతో కలిసి 'రైటర్ పద్మభూషణ్' చూడాలి: అల్లు అరవింద్

దిశ, సినిమా: సుహాస్, టీనా శిల్పరాజ్ జంటగా వచ్చిన చిత్రం 'రైటర్ పద్మభూషణ్'. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్‌పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించగా జి.మనోహర్ సమర్పించారు. అయితే ఫిబ్రవరి 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ 'సెలబ్రేటింగ్ హౌస్‌ఫుల్' ఈవెంట్‌ని నిర్వహించగా అతిథిగా వచ్చిన అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'ప్రతి ఆడపిల్ల తండ్రిని తీసుకుని ఈ సినిమాకి వెళ్ళాలి. ఆమె మనసులో ఏముందో, వాళ్లు ఏం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి మనసులోకి తొంగి చూసి, వారి కలలను తీర్చడానికి ఈ చిత్రం మహత్తరంగా ఉపయోగపడుతుంది' అన్నారు'. అలాగే సుహాస్, శరత్, అనురాగ్, ప్రశాంత్, చంద్రు, టీనా మాట్లాడుతూ.. హౌస్ ఫుల్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.