బయోపిక్‌పై అప్‌డేట్ ఇచ్చిన గంగూలీ.. ఆతృతగా ఉందంటూ!

by Hamsa |   ( Updated:2023-01-26 14:16:03.0  )
బయోపిక్‌పై అప్‌డేట్ ఇచ్చిన గంగూలీ.. ఆతృతగా ఉందంటూ!
X

దిశ, సినిమా: ఇండియన్ మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ తన బయోపిక్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ప్రముఖ నిర్మాత లవ్ రంజన్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు స్క్రిప్ట్ తానే రాస్తున్నట్లు తాజా ఇంటర్వ్యూలో తెలిపాడు. 'లవ్ రంజన్‌తో పాటు నేను కూడా బిజీగా ఉంటున్నా. అందేకే స్క్రిప్ట్ పనులకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేశాం. స్క్రీన్ ప్లే గురించి లవ్ ప్రొడక్షన్ హౌస్‌తో చర్చించాల్సివుంది. నా పాత్రను ఎవరూ పోషిస్తారనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే బిగ్ అప్ డేట్‌తో అభిమానుల ముందుకొస్తాం' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్.. సౌరవ్ పాత్రను పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తుండగా గంగూలీ కూడా రణ్‌బీర్ వైపే మొగ్గు చూపినట్లు గతంలో వార్తలొచ్చాయి. ఇక 2021లో సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాను ప్రకటించగా.. తనను గర్వంగా తలెత్తుకునేలా చేసిన క్రికెట్ ప్రయాణాన్ని ప్రజలతో పంచుకోవాలని ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు గంగూలీ తెలిపాడు.

Advertisement

Next Story