Sonusood : అనాథ పిల్లల కోసం.. సోనూసూద్ సంచలన నిర్ణయం

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-30 14:20:19.0  )
Sonusood : అనాథ పిల్లల కోసం.. సోనూసూద్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: అనాథ పిల్లల కోసం నటుడు సోనూసూద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా టైంలో వేల మందికి సాయం చేసి తన గొప్ప మనసును చాటుకుని దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. రియల్ హీరో అని అందరితో మన్ననలు పొందాడు. అయితే బీహార్ కు చెందిన ఓ యువకుడు సోనూసూద్ పై ఉన్న అభిమానంతో అనాథ పిల్లల ఓ ఇంటర్నేషనల్ స్కూల్ నడుపుతున్నాడు. అయితే 100 మంది పిల్లలు ఈ పాఠశాలలో చదువుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్ బీహార్ వెళ్లి యువకుడితో మాట్లాడారు. మెరుగైన వసతి, విద్య, ఫుడ్ అందించేందుకు కావాల్సిన సాయం చేయడంతో పాటు కొత్తగా స్కూల్ బిల్డింగ్ కట్టిస్తానని హామీ ఇచ్చాడు. పిల్లల బాధ్యతలో తాను భాగస్వామ్యం అవుతానని ప్రకటించారు. ఈ మేరకు అనాథ పిల్లలతో దిగిన ఫోటోలను ఆయన ట్విట్టర్ లో షేర్ చేయగా ప్రస్తుతం ఆఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read..

కారు డ్రైవర్ మాట విని 100 ఎకరాలను పోగొట్టుకున్న టాలీవుడ్ నటుడు

Advertisement

Next Story