పవన్ కళ్యాణ్ రాక కోసం పరితపిస్తున్న మహిళా అభిమాని.. ఆమె కోరిక తీరేనా?

by sudharani |   ( Updated:2023-05-05 09:12:57.0  )
పవన్ కళ్యాణ్ రాక కోసం పరితపిస్తున్న మహిళా అభిమాని.. ఆమె కోరిక తీరేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోలు అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు చాలా మంది ఉంటారు. ఒక్కసారైన తమ అభిమాన హీరోను నేరుగా కలవాలని పరితపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ మహిళా అభిమాని పవన్ కళ్యాణ్‌ను చూడటానికి పరితపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలం చంద్రయ్యగారిపల్లికి చెందిన అనూష అనే మహిళ పవన్ కళ్యాణ్‌కు వీరభిమాని. ఆమె గత మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే తన అభిమాన హీరోను ఒక్కసారైనా నేరుగా కలవాలని పరితపిస్తుంది. తన కూతురు కోరికను మన్నించి పవన్ కళ్యాణ్ అవకాశం కల్పించాలని అనూష తల్లి వేడుకుంటుంది. అయితే.. ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లిందో లేదో తెలియదు కానీ, ఆ మహిళ అభిమాని కోరిక తీరాలని కోరుకుందాం అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Read more:

పవన్ కల్యాణ్ అవకాశం ఇస్తే.. జనసేన నుంచి పోటీ చేస్తా

Advertisement

Next Story

Most Viewed