టిల్లుతో రొమాన్స్ చేసేటప్పుడు అలా ఫీలయ్యా.. ఆ ఫీలింగ్ నుంచి బయటకు రావడం చాలా కష్టం: అనుపమ

by Hamsa |   ( Updated:2024-03-26 04:50:46.0  )
టిల్లుతో రొమాన్స్ చేసేటప్పుడు అలా ఫీలయ్యా.. ఆ ఫీలింగ్ నుంచి బయటకు రావడం చాలా కష్టం: అనుపమ
X

దిశ, సినిమా: క్రేజీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత అన్ని లవ్ సినిమాలతో కుర్రాళ్లల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఇటీవల అనుపమ రవితేజ ఈగల్ మూవీతో కీలక పాత్రలో నటించింది కానీ హిట్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం డిజే టిల్లు సిక్వెల్‌గా రాబోతున్న టిల్లు స్వ్కేర్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది. దీనిని మల్లిక్ రామ్ తెరకెక్కిస్తుండగా సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే టిల్లు స్వ్కేర్ చిత్రానికి సంబంధించిన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌లో అనుపమ యాక్టింగ్‌ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే.. ఇన్ని రోజులు క్యూట్ పాత్రలు చేసిన ఆమె మొదటిసారిగా టిల్లు స్వ్కేర్‌‌లో బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించింది.

దీంతో అవన్నీ చూసిన ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తూ పలు వీడియోలు కూడా షేర్ చేశారు. కాగా ఈ సినిమా మార్చి 29న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమకు రొమాంటిక్ సీన్స్ గురించి ప్రశ్నించగా.. ‘‘ రొమాన్స్ చేయడం అంత ఈజీ కాదు. హీరో, హీరోయిన్ ఇంటిమెంట్‌గా ఉన్నది ప్రైవేట్ మూమెంట్. కానీ 100 మంది చూట్టూ ఉండగా సెట్‌లో సీన్స్ చేయడం చాలా కష్టమైన పని. నాకు అప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది. అందరూ సినిమాలోని కార్ సీను గురించే అడుగుతున్నారు. అసలు సీన్ షూట్ చేస్తున్న సమయంలో నేను చాలా అన్ కంఫర్టబుల్‌గా ఫీలయ్యాను.

దాంట్లోంచి బయటకు రావడం చాలా కష్టం. అయినా అలాంటి పరిస్థితుల్లో కూడా మనం బాగా యాక్ట్ చేయడం ముఖ్యం. ఎంత ఇబ్బంది కలిగినా ముఖంలో కనిపించకుండా రొమాన్స్ ఎంజాయ్ చేసినట్లు నటించి సీన్‌ను పడించడంతో పాటు ఆడియన్స్‌ను మెప్పించడం ముఖ్యం. అది అంత ఈజీ కాదు. చూసిన వాళ్లు అంతా వాళ్లు రొమాన్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటాను. కానీ అది కరెక్ట్ కాదు అందులో ఎంత కష్టం ఉందో మాకే తెలుసు. కొన్ని సీన్స్ షూట్ చేసేటప్పుడు నటీనటులు ఎంత ఇబ్బంది పడతారో వారికే అర్థమవుతుంది’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుపమ కామెంట్స్ వైరల్ అవుతుండటంతో ఫ్యాన్స్ అయ్యో పాపం అంటున్నారు.

Read More : అంత రిస్క్ అవసరమా..! ‘టిల్లు స్క్వేర్’ రన్ టైంతో ఫ్యాన్స్ అసంతృప్తి

Advertisement

Next Story