డబ్బున్న వాళ్లంతా నన్ను ట్రై చేసినవాళ్లే.. శిల్పా శెట్టి షాకింగ్ కామోంట్స్

by Kavitha |   ( Updated:2024-03-10 13:44:24.0  )
డబ్బున్న వాళ్లంతా నన్ను ట్రై చేసినవాళ్లే.. శిల్పా శెట్టి షాకింగ్ కామోంట్స్
X

దిశ, సినిమా: మోస్ట్ బ్యూటిఫుల్ సీనియర్ బాలీవుడ్ బ్యూటీ లో శిల్పా శెట్టి ఒకరు. ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది కేవలం హిందీ సినిమాల్లో మాత్రమే కాకుండా కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించింది. అందులో కొన్ని మూవీలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం కూడా అందుకున్నాయి. ప్రజంట్ పలు టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇక పోతే శిల్పా శెట్టి చాలా సంవత్సరాల క్రితం ప్రముఖ వ్యాపార వేత్త అయినటువంటి రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరి సంసార జీవితం ఎంతో సంతోషంగా సాగుతుంది. కానీ గత కొంత కాలంగా శిల్పా శెట్టి కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అని చాలా విమర్శలు వస్తున్నాయి.

అయితే తాజాగా ఈ విషయంపై నటి స్పందించింది.. ‘ ఎవ్వరు ఏం అనుకున్న నేను మాత్రం రాజ్‌ను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. అతను అంటే ఇప్పటికే నాకు ఎంతో ఇష్టం. డబ్బు కోసం అతడిని పెళ్లి చేసుకున్నాను అని కొంత మంది విమర్శలు చేస్తున్నారు. కానీ నేను రాజ్‌ను పెళ్లి చేసకోడాని ముందు ఆయన కంటే డబ్బు ఉన్న ధనికులు ఎంతో మంది నాకు పెళ్లి ప్రపోజ్ చేశారు. అయినప్పటికీ నేను వాటిని తిరస్కరించి రాజ్‌ను పెళ్లి చేసుకున్నాను. నా జీవితంలో డబ్బు ఎప్పుడూ నిర్ణయాలను ప్రభావితం చేయలేదు’ అని శిల్పా శెట్టి చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story