Dulquer Salmaan 'Sita Ramam': భారీ ఓపినింగ్స్‌తో రేపే 'సీతారామం' రిలీజ్

by sudharani |   ( Updated:2022-08-11 07:04:53.0  )
Dulquer Salmaan Starrer Sita Ramam Movie to Release On August 11 in UAE
X

దిశ, వెబ్‌డెస్క్: Dulquer Salmaan Starrer 'Sita Ramam' Movie to Release On August 11 in UAE| మళయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా.. హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా 'సీతారామం'. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా మంచి హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు మళ్లీ రిలీజ్ ఏమిటీ అనుకుంటున్నారా.. అందుకు ఓ రీజన్ ఉంది. 'సీతారామం' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ సిద్ధం కాగా.. గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా రిలీజ్‌కు సెస్సార్ ఒప్పుకోలేదు. ఈ సినిమాలో మత పరమైన కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ.. అందుకే సినిమాను రిలీజ్ చేయవద్దంటూ గల్ఫ్ సెన్సార్ తెలిపింది. కాగా.. ఇప్పుడు అన్ని ఫార్మాలటీస్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆగస్టు 11న యుఏఈలో భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయ్యి హిట్ టాక్ సంపాదించుకోవడంతో ఓపెనింగ్ కూడా భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు చిత్ర యూనిట్.

ఇది కూడా చదవండి: సమంత మళ్లీ ఎదురైతే.. నాగచైతన్య అలా చేస్తాడంట

Advertisement

Next Story