సింగర్ మంగ్లీ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా ?

by Prasanna |   ( Updated:2023-01-28 07:46:09.0  )
సింగర్ మంగ్లీ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమలో పాపులర్ సింగర్స్ లిస్టులో మంగ్లీ పేరు కూడా చేరింది. ఇప్పటివరకు మంగ్లీ పాడిన అన్ని పాటలు హిట్ అయ్యాయి. కెరీర్ మొదట్లో న్యూస్ ఛానెల్ యాంకర్ గా మొదలు పెట్టిన ఆమె బతుకమ్మ, శివుడు పాటలతో పాపులర్ అయ్యింది. ఈమె సొంత జిల్లా చిత్తూరు. అయితే తెలంగాణకు వచ్చి మంగ్లీగా మారి ఇక్కడి యాసలో పాటలు పాడుతూ తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. పాటలు మాత్రమే కాకుండా చిన్న చిన్న సినిమాల్లో కూడా నటించింది.ఇప్పుడు హీరోయిన్నుగా కూడా తనను తాను పరీక్షించుకోనుందట. మంగ్లీ హీరోయిన్‌గా త్వరలో ఓ సినిమా చేయనుందట. ఆమె చేసేది తెలుగులో కాదట .. కన్నడలో నటించబోతుందట.. ఈ సినిమాకు చక్రవర్తి చంద్రచూడ్ దర్శకత్వం వహించనున్నారు. ఇలా ఒక పక్క పాటలు.. ఇంకో పక్క సినిమాలతో బిజీ అయిపొయింది. మొదట్లో ఒక్కో పాటకు మంగ్లీ రూ.20 వేల తీసుకునేది.. ఇప్పుడు ఒక్కో పాటకు అక్షరాలా లక్ష రూపాయలు ముట్టజెబుతున్నారట.

ఇవి కూడా చదవండి: Unstoppable With NBK S2: NBK X PSPK Part 1 PROMO

Advertisement

Next Story