షూటింగ్‌లో తలకు గాయం.. గతం మరిచిపోయిన Disha Patani

by Hamsa |   ( Updated:2022-11-05 13:02:51.0  )
షూటింగ్‌లో తలకు గాయం.. గతం మరిచిపోయిన Disha Patani
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ దిశా పటానీ డెడికేషన్‌కు అందరూ ఫిదా అవ్వాల్సిందే. యాక్టింగ్, మోడలింగ్ విషయంలో కమిట్మెంట్‌తో వర్క్ చేసే తనకు అభిమానుల నుంచి ఎప్పుడూ లవ్ అండ్ సపోర్ట్ అందుతూనే ఉంటుంది. ఇక షూటింగ్ గ్యాప్‌లో జిమ్, జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్‌లో గడిపే ఆమె.. ఫిట్‌నెస్ మెయింటెన్ చేయడంలోనూ బెస్ట్ అనిపించుకుంటుంది. అయితే సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన 'భరత్' సినిమాలో జిమ్నాస్ట్ చేస్తూ కనిపించిన ఆమె.. ఈ షూటింగ్‌లో కాంక్రీట్ టెర్రస్ ఫ్లోర్‌పై ఓ స్టంట్ చేసే క్రమంలో తలకు గాయమైనట్లు తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. దెబ్బ బలంగా తగలడంతో ఆరు నెలలపాటు మెమొరీ కోల్పోయానని చెప్పింది. ఆ సమయంలో ఏం జరిగిందో ఇప్పటికీ గుర్తులేదన్న ఆమె.. వైద్యుల సాయంతో ఈ పరిస్థితి నుంచి సురక్షితంగా బయటపడినట్లు వివరించింది.

ఇవి కూడా చదవండి : వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ప్రముఖ నటి.. పరిస్థితి విషమం


Next Story

Most Viewed