Bruce Lee biopic : ఇదే నా డ్రీమ్ ప్రాజెక్ట్.. బ్రూస్ లీ బయోపిక్‌పై ఆంగ్‌లీ

by Hamsa |   ( Updated:2022-12-01 15:30:05.0  )
Bruce Lee  biopic : ఇదే నా డ్రీమ్ ప్రాజెక్ట్.. బ్రూస్ లీ బయోపిక్‌పై ఆంగ్‌లీ
X

దిశ, సినిమా: హాలీవుడ్ నటుడు బ్రూస్‌లీ చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్‌లో అదరగొట్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా 32 ఏళ్ల వయసులో ఆయన మరణించినా తను నటించిన సినిమాలు ఇప్పటికీ అభిమానులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బ్రూస్‌లీ జీవితంపై మరో బయోపిక్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆస్కార్ అవార్డులు సాధించిన దర్శకుడు ఆంగ్‌లీ.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ..'బ్రూస్ లీ గురించి ప్రపంచానికి తెలియాల్సింది ఎంతో ఉంది. ఆయన పడ్డ కష్టాలను ఇందులో చూపించే ప్రయత్నం చేస్తా. కొన్నేళ్లనుంచి ఈ బయోపిక్ గురించి పరిశోధన చేస్తున్నా. ఇదే నా డ్రీమ్ ప్రాజెక్ట్. త్వరలోనే షూటింగ్ మొదలు పెడతా' అంటూ ఇన్‌స్టా వేదికగా అనౌన్స్ చేశాడు.

READ MORE

అధికారికంగా విడాకులు తీసుకున్న మరో స్టార్ జంట.. పిల్లలనూ పంచుకున్నారు..

Advertisement

Next Story