ఆ హీరో, హీరోయిన్ మళ్లీ డేటింగ్ స్టార్ట్ చేశారా..? మీడియాకు లీకులిచ్చిన మాజీ లవర్..

by Sumithra |
ఆ హీరో, హీరోయిన్ మళ్లీ డేటింగ్ స్టార్ట్ చేశారా..? మీడియాకు లీకులిచ్చిన మాజీ లవర్..
X

దిశ, ఫీచర్స్ : టైగర్ ష్రాఫ్ నటించిన 'బడే మియాన్ ఛోటే మియాన్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 11న ఈద్ సందర్భంగా థియేటర్లలో విడుదలవ్వనుంది. ఈ సందర్భంగా చేసిన ఓ ఇంటర్వ్యూలో నటుడు టైగర్ ష్రాఫ్ తన ప్రేమ జీవితం గురించి మాట్లాడాడు. తన మాజీ ప్రియురాలు దిశా పటానీతో ప్యాచ్ అప్ అయ్యిందని అతని మాటలను బట్టి తెలుస్తోంది !. ఇదిలా ఉంటే ఇటీవల హోలీ సందర్భంగా దిశాపటాని, టైగర్, అక్షయ్ కుమార్‌లతో కలర్స్‌లు హోలీ ఆడుతూ కనిపించింది.

టైగర్ ష్రాఫ్ దిశా పటానితో ప్యాచ్-అప్ పుకార్ల గురించి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'నాకు జీవితంలో ఒకే ఒక దిశ ఉంది' అని చెప్పాడు. ఆ తర్వాత వెంటనే నవ్వుతూ టాపిక్ మార్చేశాడు. ఇక 'బడే మియాన్ ఛోటే మియాన్' ట్రైలర్ లాంచ్‌లో ఓ జర్నలిస్టు అక్షయ్ కుమార్‌ను టైగర్‌కి ఏమి సలహా ఇవ్వాలనుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు అక్షయ్ నవ్వుతూ, 'టైగర్‌ని ఎప్పుడూ ఒకే దిశలో ఉండమని నేను చెబుతాను !' అన్నాడు. దాంతో టైగర్ ష్రాఫ్ అక్షయ్ ని చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడ్డాడు.

2016 నుంచి డేటింగ్ పుకార్లు, 2023లో టైగర్-దిషా బ్రేకప్ !

2016 నుండి దిశా పటానీ, టైగర్ ష్రాఫ్ ల డేటింగ్ గురించి పుకార్లు ఉన్నాయి. అయితే ఈ రిలేషన్ షిప్ గురించి ఇద్దరూ ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. దిశా, టైగర్ సోదరి కృష్ణ ష్రాఫ్ చాలా స్నేహంగా ఉంటుంది. అయితే గత ఏడాది 2023 లో వారు విడిపోయిన వార్త వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కనిపించడం మానేశారు. అయితే, ఇద్దరూ మళ్లీ హోలీ రోజు కలిసి కనిపించారు.

Advertisement

Next Story