- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శివాజీ చెల్లెలినే పెళ్లి చేసుకున్నాడన్నది నిజమేనా..? క్లారిటీ ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్: హీరో శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించారు. ఒకానొక సమయంలో ఓ రేంజ్‌ను మెయింటెన్ చేసిన ఈ నటుడు తర్వాత పాలిటిక్స్‌లోకి వెళ్లి తనకున్న పేరును తానే డ్యామేజ్ చేసుకున్నారు. ప్రస్తుతం నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్ బాస్ సీజన్- 7 లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టాడు. దీంతో నెటిజన్లు శివాజీపై కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.
‘‘శివాజీ మరో కొత్త కోణాన్ని చూపిస్తున్నాడుగా.. ఇప్పటి వరకు శివాజీలో ఉన్న ఒక కోణాన్ని మాత్రమే మనం సినిమాల్లో, పాలిటిక్స్‌లో చూశాం. కానీ.. బిగ్ బాస్ హౌస్‌లో అసలు శివాజీ అంటే ఏంటి? అనేది ఇప్పుడు చూస్తున్నాం.’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లు కూడా అంత చురుగ్గా ఆడట్లేదు. అసలు శివాజీ హౌస్‌లో ఏం చేస్తున్నాడు.. పెత్తనం తప్ప ఏం చేయట్లేదు. ఏం ఆడట్లేదు. అంటూ ఆడియన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.
ఇకపోతే శివాజీ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. శివాజీ చెల్లెలు వరుస అయ్యే అమ్మాయిని లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. కాగా ‘ఈయన వివాహం చేసుకున్న అమ్మాయి తన చెల్లెలే కాదు. వరుసకు కూడా అస్సలు చెల్లెలు కాదు. శివాజీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. శివాజీకి రెండు పెళ్లిళ్లు అయ్యాయి అనేది కూడా అవాస్తవం. అసలు శివాజీ భార్య తన బంధువే కాదు. వారి క్యాస్ట్ కూడా కాదు.’’ అంటూ సోషల్ మీడియాలో శివాజీని విమర్శిస్తున్న వ్యక్తులకు శివాజీ ఫ్యాన్స్ తాజాగా దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చారు.
శివాజీది ఏపీలోని గుంటూరు జిల్లా. తన భార్య శ్వేతది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా. తను వరుసకు చెల్లెలు ఎలా అవుతుంది? ఇలా పుకార్లు సృష్టించే ముందు కాస్తైన ఆలోచించాలి. ఈ నటుడు మంచి పర్సన్ కాబట్టి రూపాయి కట్నం కూడా తీసుకోకుండా తనను వివాహం చేసుకున్నాడు. ఒక సెలబ్రిటీ అయినా కూడా సాధారణ వ్యక్తిలా జీవిస్తుంటాడు. తనపై ఇలా చెల్లెలినే లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని పుట్టించింది మాత్రం రాజకీయ నాయకులే. అంటూ అభిమానులు ఇచ్చిపడేశారు.