- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NTR: ‘దేవర’ రిలీజ్ వేళ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. ఏమన్నారంటే?
దిశ, సినిమా: ఎన్టీఆర్ అభిమానులు ఆరేళ్ల నుంచి ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ‘దేవర’ ఎట్టకేలకు నేడు (సెప్టెంబర్ 27)న థియేటర్స్‌లో విడుదలైంది. దీనిని కొరటాల శివ తెరకెక్కించగా.. తారక్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించింది. అయితే ఇందులో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నో అంచనాల మధ్య దేవర విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో.. ఎన్టీఆర్ దేవర రిలీజ్‌ను పురస్కరించుకొని సినీ ప్రియులు, అభిమానులను ఉద్దేశించి X వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘ఎట్టకేలకు నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మా సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానాన్ని చూసి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అద్భుతమైన డ్రామా, భావోద్వేగాలతో ‘దేవర’ తీర్చిదిద్దినందుకు కొరటాల శివకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మై బ్రదర్ అనిరుధ్, నీ మ్యూజిక్‌తో మా ప్రపంచానికి ప్రాణం పోశావు. ఈ చిత్రానికి బలమైన సపోర్ట్‌గా నిలిచిన మా నిర్మాతలు మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కే అద్భుతంగా వర్క్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు.
నా అభిమానులకు, ‘దేవర’ కోసం మీరు జరుపుకుంటున్న వేడుకలను చూసి నా మనసు నిండిపోయింది. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నేను చేసినంతగా మీరు కూడా ఆనందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీ అందరినీ అలరిస్తూనే ఉంటానని వాగ్దానం చేస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. ప్రజెంట్ ఎన్టీఆర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.