- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan: రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమా కోసం రంగంలోకి డిప్యూటీ సీఎం!
దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమాను హరీష్ శంకర్ తెరకెక్కిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీతో బాలీవుడ్ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, టీజర్, ట్రైలర్ ఇప్పటికే విడుదలై భారీ అంచనాలను పెంచేశాయి. అంతేకాకుండా హీరోహీరోయిన్ మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ వల్ల విమర్శలు కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా ఇందులోంచి విడుదలైన సాంగ్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. కానీ హీరోయిన్‌ను నలిపేశాడని అంతా దారుణంగా కామెంట్లు పెట్టారు.
దీంతో అలా చేసే వారికి హరీష్ శంకర్ గట్టి కౌంటర్స్ వేశారు. అయితే మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్టు 15న థియేటర్స్‌లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా, మిస్టర్ బచ్చన్ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంను ఆహ్వానించారని తెలుస్తోంది. ఇప్పటికే మిస్టర్ బచ్చన్ నిర్మాతలు ఆయనకు విషయం చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన అంగీకారం కోసం వెయిట్ చేస్తున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. పవన్ వస్తే మాత్రం రవితేజ సినిమాకు హైప్ క్రియేట్ అవ్వడం పక్కా అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
- Tags
- Ravi Teja