మళ్లీ ప్రేమలో పడిన దీప్తి సునైనా.. నా ప్రాణం నీలోనే ఉందంటూ పోస్ట్!

by Hamsa |   ( Updated:2024-03-27 08:36:15.0  )
మళ్లీ ప్రేమలో పడిన దీప్తి సునైనా.. నా ప్రాణం నీలోనే ఉందంటూ పోస్ట్!
X

దిశ, సినిమా: నటి దీప్తి సునైనా ముందు యూట్యూబ్‌లో పలు వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ సాంగ్ చేస్తూ స్టార్ హీరోయినంత ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు రియాలిటీ బిగ్‌బాస్ షోకు కంటెస్టెంట్‌గా వెళ్లి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తన అందం క్యూట్ నెస్‌తో అందరి మనసులు గెలుచుకుంది. అయితే దీప్తి- యూట్యూబర్ షణ్ముఖ్‌ ప్రేమించుకుని క్రేజీ కపుల్‌గా స్పెషల్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఆ తర్వాత విభేదాలు రావడంతో బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు.

ఇక అప్పటి నుంచి వీరిద్దరు ఎవరి లైఫ్ వారు చూసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం దీప్తి సునైనా ప్రవేట్ సాంగ్ చేయడంతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటోంది. నిత్యం తన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, దీప్తి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. అలాగే చీర కట్టుకొని అందంగా ఫొటోలు షేర్ చేస్తూ ..‘‘నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు పోస్ట్ వైరల్ అవుతుండగా అది చూసిన వారంతా దీప్తి సునైనా మళ్ళీ ప్రేమలో పడింది కావొచ్చు అందుకే హింట్ ఇస్తూ అతని గురించే ఈ పోస్ట్ పెట్టిందని అంటున్నారు.

Advertisement

Next Story