- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నా భర్తతో కమిట్ అవ్వడం ఇష్టం లేదు: షాకిచ్చిన స్టార్ హీరోయిన్ Deepika Padukone

దిశ, సినిమా : బీటౌన్ బ్యూటీ దీపికా పదుకొనే ఇండస్ట్రీలో తనకున్న రిలేషన్‌షిప్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన గతాన్ని గుర్తుచేసుకున్న ఆమె తన భర్త రణ్‌వీర్‌ను వివాహం చేసుకోవడానికి ఎందుకు సమయం తీసుకోవాల్సి వచ్చిందో వివరించింది. నిజానికి ఒక హీరోను పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా లేనన్న ఆమె.. అనేక సంబంధాలు కలిగి ఉన్నప్పుడు వాళ్లపై పెట్టుకున్న నమ్మకం విచ్ఛిన్నమైనట్లు పేర్కొంది.
'13 ఏళ్లపాటు ఎంతో మందితో స్నేహం చేశా. అందరూ మోసం చేసిన ఎఫెక్ట్‌తో కొంతకాలం ఒంటరిగా ఉండాలనుకున్నా. ఇప్పుడు నాకు పెళ్లి అయింది కాబట్టి నిజాలు చెప్పగలుగుతున్నా. మీరు ఒకరు లేదా ఇద్దరు అంతకుమించి ఎవరిని ఇష్టపడినా.. వాళ్లతో వంద శాతం నిజాయితీగా ఉండండి' అంటూ ప్రేమికులను కోరింది. చివరగా 2012లో తాను ఒకరి రిలేషన్‌షిప్ నుంచి బయటకి వచ్చేశాక తన పని అయిపోయిందని భావించానన్న బ్యూటీ.. దీంతో ఎవరికీ జవాబుదారీగా ఉండనవసరం లేదని, క్యాజువల్ డేటింగ్ అనే కాన్సెప్ట్‌ని ప్రయత్నించాలనుకున్నట్లు తెలిపింది.
Also Read: నా భార్య Ramya Krishna అమాయకురాలు కాదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన Krishna Vamshi
Also Read: నా జీవితంలో ప్రేమ, పెళ్లికి చోటులేదు.. యంగ్ బ్యూటీ